అక్కాచెల్లెళ్ల ‘గాజుల’ బంధం | - | Sakshi
Sakshi News home page

అక్కాచెల్లెళ్ల ‘గాజుల’ బంధం

Sep 8 2026 12:35 AM | Updated on Sep 8 2026 12:35 AM

గాజుల పండుగ చేసుకున్నం

పల్లెల్లో జోరుగా ‘సిస్టర్స్‌ బ్యాంగిల్స్‌’ ట్రెండ్‌

ఒకే రంగు, ఒకే డిజైన్‌ గాజులతో మురిసిపోతున్న అక్కాచెల్లెళ్లు

గంభీరావుపేట(సిరిసిల్ల): పల్లె వాతావరణంలో సంప్రదాయాలు కొత్త ట్రెండ్స్‌తో మేళవించి సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా అక్కాచెల్లెళ్ల మధ్య ఉన్న ఆత్మీయతను చాటేందుకు గాజులు వేయించుకోవడం ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ట్రెండ్‌గా మారింది. పండుగలు, శుభకార్యాలు, కుటుంబ వేడుకల సందర్భంగా అక్కాచెల్లెళ్లు ఒకే రకమైన చీరలు, ఒకే డిజైన్‌ గాజులు ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అక్కాచెల్లెళ్ల అనుబంధానికి గాజులు సింగారించుకుంటున్నాయి. గాజుల గలగలలో సోదరీలు ప్రేమ పంచుకుంటున్నారు. మనస్సు నిండా ఆనందంతో చేతినిండా గాజులు వేసుకుంటున్నారు. ఇప్పుడు పల్లెల్లో ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. గాజులు వేయించుకుంటున్న అక్కాచెల్లెళ్లతో పల్లెల్లో సందడి నెలకొంటుంది.

గాజుల చప్పుళ్లతో ఆప్యాయత

చేతినిండా రంగురంగుల గాజులు ధరించి, అందరూ కలిసి ఒకే తరహాలో ఫొటోలు దిగడం యువతులు, మహిళల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా అక్కాచెల్లెళ్ల అనుబంధం, ప్రేమ, ఐక్యతను ప్రతిబింబించేలా గాజులు వేయించుకోవడం సోషల్‌ మీడియాలోనూ ప్రత్యేకంగా కనిపిస్తోంది.

పల్లె నుంచి సోషల్‌ మీడియా వరకు..

గతంలో గాజులు అంటే పండుగలు, పెళ్లిళ్లు, సంప్రదాయ వేడుకలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు కొత్త ఫ్యాషన్‌ జోడైంది. స్నేహితులు, అక్కాచెల్లెళ్లు కలిసి గాజులు వేయించుకుని శ్రీసిస్టర్‌ గ్యాంగ్‌శ్రీగా ఫొటోలు దిగుతూ జ్ఞాపకాలను పదిలం చేసుకుంటున్నారు.

గాజుల గలగలలో అనుబంధం

చేతికి అలంకారమే కాదు.. అక్కాచెల్లెళ్ల మధ్య ప్రేమకు ప్రతీకగా గాజులు మారుతున్నాయి. ఒకే రంగు.. ఒకే డిజైన్‌.. ఒకే ఆనందం.. ఇలా పల్లె మహిళల చేతుల్లో గాజుల గలగలలు కొత్త సందడిని తీసుకొస్తున్నాయి.

అక్కాచెల్లెళ్లందరం కలిసి గాజుల పండుగ చేసుకున్నం. ప్రేమానురాగాలతో ఒకరికొకరం కొత్త గాజులు వేసుకున్నం. ఒకే రకమైన గాజులు ధరించి సంబురపడ్డాం. అక్కాచెల్లెళ్ల బంధాన్ని చాటి చెప్పేలా ఒకే డిజైన్‌, ఒకే రంగు గాజులు ధరించాం. మా అనుబంధం మరింత బలపడింది.

– ఎర్ర లావణ్య, గంభీరావుపేట,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement