హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం | - | Sakshi
Sakshi News home page

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

Sep 8 2026 12:35 AM | Updated on Sep 8 2026 12:35 AM

ప్రజావాణిలో బీఆర్‌ఎస్‌ నాయకుల ఫిర్యాదు

సిరిసిల్ల అర్బన్‌: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడం లేదని కలెక్టరేట్‌ ప్రజావాణిలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. అంతకుముందు కలెక్టరేట్‌ గేట్‌ వద్ద నిరసన తెలపగా.. పోలీసులకు, బీఆర్‌ఎస్‌ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, నాయకులు గూడూరి ప్రవీణ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ గడ్డం నగేశ్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు. బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, బొల్లి రామ్మెహన్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దార్ల సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement