ముస్తాబాద్(సిరిసిల్ల): సన్నబియ్యం స్థానంలో అధిక శాతం నూకలే వచ్చాయని గూడెం లబ్ధిదారులు చేసిన ఫిర్యాదుతో జిల్లా అధికారులు స్పందించారు. ఈమేరకు గూడెం రేషన్‌షాపును జిల్లా పౌరసరఫరాల అధికారులు గురువారం సందర్శించారు. రేషన్ బియ్యంలో అధికశాతం నూకలే ఉండడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లామని కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు బాలయ్య తెలిపారు. స్పందించిన అధికారులు దుకాణాల్లో దించిన బియ్యాన్ని తిరిగి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశారన్నారు. నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేయాలని సర్పంచ్ తాటిపల్లి శంకర్ కోరారు. మాజీ ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, డీలర్లు ఉన్నారు.


