ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
710 మందికి మంజూరుపత్రాలు పంపిణీ
సిరిసిల్ల: అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలో మొదటి విడత మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో నిర్మించుకోని 710 మంది స్థానంలో కొత్త వారికి మంజూరు పత్రాలను గురువారం సిరిసిల్లలో పంపిణీ చేశారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తున్నామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు.
వేగంగా ఇళ్లు నిర్మించుకోవాలి
కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ... సొంతిల్లు ప్రతి ఒక్కరి కల అని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పొందిన వారు ప్రభుత్వం నిర్ణయించిన విస్తీర్ణంలో త్వరగా ముగ్గు పోసుకోవాలని సూచించారు. నియోజకవర్గానికి 2వేల ఇళ్ల చొప్పున మంజూరు చేశారని తెలిపారు. మండలాల వారీగా స్టాల్స్ ఏర్పాటు చేసి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి కె.కె.మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మున్సిపల్ చైర్మన్లు జిందం కళాచక్రపాణి, పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్లు తిరుపతి, కచ్చకాయల ఎల్లయ్య, ఆర్.రాజు, వెల్ముల స్వరూప, సబేరా బేగం, రాణి, రాములునాయక్, విజయ, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు, సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ జీఎం హన్మంతు, తహసీల్దార్ మహేశ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ విప్ ఆడెపు చంద్రకళ పాల్గొన్నారు.


