చెరువు నిండదు | - | Sakshi
Sakshi News home page

చెరువు నిండదు

Sep 4 2026 2:24 AM | Updated on Sep 4 2026 2:24 AM

చిన్నబోతున్న చిన్ననీటి వనరులు

నిత్యం వర్షం జల్లులు..

సాధారణ స్థాయిలోనే వర్షపాతం

656 చెరువులు.. మత్తడి దూకినవి 37

చినుకు ఆగదు..

సిరిసిల్ల: జిల్లాలో చిన్ననీటి వనరుల కిందట 44వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఏడాది వానాకాలం పంటలకు నీటి ఇబ్బంది లేక పోగా.. యాసంగికి మాత్రం సాగునీటి ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో వర్షాకాలం మొదలైంది. కాలం కరిగిపోయినా భారీ వర్షాలు కురువక పోవడంతో చెరువుల్లోకి నీరు చేరలేదు. నిత్యం ముసురు కురుస్తున్నా చెరువులు, కుంటలు నిండే అవకాశం కనిపించడం లేదు. ఇంకా వర్షాకాలం మరో నెల రోజులుండగా భారీ వర్షాలపై రైతులు ఆశలు పెట్టుకుంది. జిల్లాలో రోజూ వర్షం కురుస్తూనే ఉన్నా.. చెరువుల్లోకి వరద చేరలేదు. సగానికి పైగా చెరువులకు జలకళ సంతరించనే లేదు. ఈ వర్షాకాలం పంటకు ఇబ్బంది లేకపోయినా.. వచ్చే సీజన్‌లో పంటలకు మాత్రం ఏమాత్రం నీరు సరిపోదు అని రైతులు వాపోతున్నారు.

వర్షపాతం వివరాలు(మిల్లీ మీటర్లలో)

మండలం గతేడాది ఈ ఏడాది సాధారణం తేడా శాతం

రుద్రంగి 500.4 467.0 628.9 – 26

చందుర్తి 624.2 541.1 647.9 – 16

వేములవాడ రూరల్‌ 584.2 554.2 609.5 – 09

బోయినపల్లి 528.6 539.0 539.0 – 00

వేములవాడ 638.0 728.3 622.0 17

సిరిసిల్ల 534.3 583.5 592.7 – 02

కోనరావుపేట 560.8 677.2 534.0 27

వీర్నపల్లి 643.4 720.8 566.5 27

ఎల్లారెడ్డిపేట 599.0 742.5 557.1 33

గంభీరావుపేట 714.7 584.5 541.3 08

ముస్తాబాద్‌ 635.5 497.8 482.3 03

తంగళ్లపల్లి 703.9 619.8 599.4 03

ఇల్లంతకుంట 788.2 498.9 466.7 07

ఇది గంభీరావుపేట మండలంలోని వెంకటాద్రి చెరువు. ప్రస్తుతం 80 శాతం మేరకు నిండింది. మరో 20 శాతం నిండితే మత్తడి దూకుతుంది. దీని కింద 600 ఎకరాల ఆయకట్టు ఉండగా... వానాకాలం పంటకు సాగునీటికి ఇబ్బంది లేదు. యాసంగి పంటలకు భరోసా లేదు. చెరువు మత్తడి పారితేనే యాసంగికి ఢోకా ఉండకపోయేది.

ఇది గంభీరావుపేట మండలం నర్మాల శివారులోని ఎగువ మానేరు జలాశయం. రెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ఎగువ మానేరు జలాశయంలో కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కురిసిన వర్షాలతో పూర్తి స్థాయిలో నిండి మత్తడి దూకింది. ఈ జలాశయంలోని నీటి మట్టాన్ని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, ఎస్పీ మహేశ్‌ బీ గీతే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలోని భారీ, మధ్యతరహా జలాశయాలు పూర్తి స్థాయిలో నిండగా.. చెరువు, కుంటలు ఇంకా నిండలేదు.

చిన్ననీటి వనరుల స్వరూపం

మొత్తం చెరువులు 656

నీటిశాతం చెరువులు

0–25 247

25–50 192

50–75 89

75–100 91

మత్తడి దూకినవి 37

తెగిన, బుంగపడినవి 02

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement