సిరిసిల్ల: ఎకై ్సజ్‌శాఖ కుదుపునకు గురైంది. ఉన్నఫలంగా జిల్లాలోని ఎకై ్సజ్ సీఐలు, ఎస్సైలను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎల్లారెడ్డిపేట సీఐ ఎం.శ్రీనివాస్‌ను హన్మకొండకు, వేములవాడ సీఐ రాజశేఖర్‌ను కొత్తగూడెంకు, సిరిసిల్ల ఎస్సై ప్రణీత్‌ను ఖమ్మం–1కు, డీటీఎఫ్ ఎస్సై శైలజను భూపాలపల్లికి, వేములవాడ ఎస్సై కె.శ్రీనివాస్‌ను హసన్‌పర్తికి, మరో ఎస్సై రవిని నిజామాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు బదిలీ చేశారు. వరంగల్ అర్బన్ సీఐ ప్రభాకర్‌రెడ్డిని వేములవాడకు, బెల్లంపల్లి సీఐ శారదను సిరిసిల్లకు, ఆదిలాబాద్ ఎస్సై విజయేందర్‌ను సిరిసిల్లకు, హన్మకొండ నుంచి ఎస్సై జి.రమ్యను వేములవాడకు బదిలీ చేశారు. ఈమేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి.
మిడ్‌మానేరు నీటిని విడుదల చేయాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): మిడ్‌మానేరు కుడికాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని వల్లంపట్ల, వంతడుపుల, నారెడ్డిపల్లి, రంగంపేట రైతులు గురువారం వంతడుపుల బ్రిడ్జిపైన బైఠాయించారు. రైతులు మాట్లాడుతూ సాగునీరు లేక వరి పొలాలు ఎండిపోతున్నాయన్నారు. తహసీల్దార్ సురేష్ చేరుకొని రైతులతో మాట్లాడి నీటిపారుదల అధికారులతో మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో నిరసన విరమించా రు. కేతిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సిద్ధం వేణు, వంతడుపుల మాజీ సర్పంచ్ కట్ట వెంకటరెడ్డి, అనిల్ పాల్గొన్నారు.
పల్లగుట్టను పరిరక్షించాలి
సిరిసిల్లటౌన్: ముస్తాబాద్ మండల్ గూడూరు, నామాపూర్ మధ్య గల పల్లగుట్టను పరిరక్షించాలని సీపీఐ జిల్లా నాయకులు గుంటి వేణు కోరారు. సిరిసిల్లలోని కార్మిక భవన్‌లో గురువారం సీపీఐ నాయకులు పంతం రవి, సోమ నాగరాజుతో కలిసి మాట్లాడారు. కోట్లాది రూపాయల విలువైన రంగురాళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలన్నారు. పల్లగుట్ట రాళ్లగుట్ట కాదని.. గూడూరుకు సహజ రక్షణగా ఉందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రాణిప్రసాద్‌కు పురస్కారం
సిరిసిల్లటౌన్: బాలసాహితీవేత్త డాక్టర్ కందేపి రాణీప్రసాద్ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. బాలసాహిత్యంలో దాదాపు 60 రచనలు చేశారు. పిల్లల కోసం అనేక పాఠ్యాంశాలను సులభంగా చదువుకునేలా టీచింగ్ ఎయిడ్స్ తయారు చేసిన ఆమెను సెప్టెంబరులో మలేషియాలో జరిగే వేడుకలలో ఆమెను అవార్డుకు ఎంపిక వేశారు. సైన్స్, యాత్ర, కళలకు అనువాదాలకు సంబంధించి చేసిన రచనలకు పురస్కారానికి ఎంపిక చేసినట్లు గ్లోబల్ పీస్ ఫౌండేషన్ పేర్కొంది.
డ్రైవింగ్ స్కూల్‌లో జపాన్ బృందం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని మండెపల్లి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్(ఐడీటీఆర్)ను గురువారం జపాన్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఐటీడీఆర్‌లో డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే విధానాన్ని యంత్రాలను పరిశీలించారు. డ్రైవింగ్ స్టిమ్యులేటర్‌ను పరిశీలించి డ్రైవింగ్ చేశారు. జపాన్ బృందం ఓసి బుచి, రాజ్‌కుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఐడిటీఆర్ ప్రిన్సిపాల్ దురై మురుగన్ పాల్గొన్నారు.
కొండాపూర్‌కు బస్సు ప్రారంభం
కోనరావుపేట: మండలంలోని కొండాపూర్‌కు బస్సు సౌకర్యం లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. సర్పంచ్ వంకాయల గౌతమి ఈ విషయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాశ్‌రావుతో మాట్లాడారు. ప్రభుత్వ విప్ చొరవతో గురువారం నుంచి గ్రామానికి తిరిగి బస్సు రాకపోకలు ప్రారంభమయ్యాయి.


