కరీంనగర్ సిటీ/రాయికల్/కథలాపూర్/రామగుండం/చొప్పదండి/తిమ్మాపూర్/సిరిసిల్ల టౌన్/చందుర్తి: ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు అధ్యాపకులు, ఉపాధ్యాయుల పనితీరుకు గుర్తింపు లభించింది. ఈనెల 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉన్నతవిద్య, విద్యాశాఖ ఉత్తమ పురస్కారాలు ప్రకటించింది. శాతవాహన వర్సిటీ వృక్షశాస్త్ర ప్రొఫెసర్ పడాల తిరుపతి, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం అధ్యాపకుడు డి.హరికాంత్, రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయలక్ష్మి ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికయ్యారు. పడాల తిరుపతి జగిత్యాల జిల్లా రాయికల్ వాస్తవ్యుడు. ఆయనను ఉపాధ్యా య సంఘం రాష్ట్ర సేవ విభాగం కన్వీనర్ చెరుకు మహేశ్వరశర్మ, టీఆర్టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ముక్కెర శేఖర్, ఎంఈవో రాఘవులు అభినందించారు. డి.హరికాంత్ 2015 నుంచి శాతవాహన వర్సిటీలో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్నారు. గతంలో కామర్స్ విభాగం అధిపతిగా, బీవోఎస్ చైర్మన్‌గా, హాస్టల్స్ చీఫ్ వార్డెన్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా, స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ, యూసీసీబీఎం ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. వైస్‌చాన్స్‌లర్ ఓఎస్‌డీగా సేవలు అందిస్తున్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులుగా..
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గుండు విజయ్, పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పొట్యాల హైస్కూల్ మ్యాథ్స్ ఉపాధ్యాయుడు గద్దె శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు గూట్ల మధుసూదన్, ఇదే జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు షరీఫ్ అహ్మద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల బాలికల హైస్కూల్ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు చేరాల తిరుపతి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. వీరంతా పనితీరులో ప్రత్యేకత.. వృత్తిధర్మాన్ని అంకిత భావంతో నిర్వహించడం తదితరాల కారణంగా ఉత్తములుగా ఎంపికయ్యారు. ఎంపికై న అధ్యాపకులను, ఉపాధ్యాయులను పలువురు విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, విద్యాభిమానులు అభినందించారు.
చేరాల తిరుపతి
పడాల తిరుపతి
గుండు విజయ్
హరికాంత్
గద్దె శ్రీనివాస్
గూట్ల మధుసూదన్
షరీఫ్
విజయలక్ష్మి


