తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని కస్బేకట్కూర్ పంచాయతీ పరిధిలోని చింతలపల్లికి విద్యుత్ సరఫరా అందిస్తున్న 11 కేవీ విద్యుత్‌లైన్ చెరువు గుండా వెళ్తున్న దానిపై సాక్షి బుధవారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఎన్పీడీసీఎల్ ఏఈ మధుకర్ చెరువులోని విద్యుత్‌లైన్‌ను పరిశీలించారు. పాతలైన్‌ను తొలగించి, సురక్షితమైన మార్గంలో నూతన 11 కేవీ లైన్‌ను ఏర్పాటుకు కావలసిన నిధుల అంచనా నివేదికను తయారు చేశామన్నారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు మంజూరుకాగానే నూతన విద్యుత్‌లైన్ పనులు ప్రారంభించి చెరువులోని ప్రమాదకర లైన్‌ను తొలగిస్తామన్నారు. ఎల్‌ఐ వెంకటేశ్వరరావు సిబ్బంది తదితరులు ఉన్నారు.


