నర్సింగపూర్ గ్రామైక్య సంఘానికి 450 యూరియా బస్తాలు వచ్చాయి. బస్తాలన్నీ రైతులకు పంపిణీ చేశారు. కొత్తగా వచ్చిన కేంద్ర ప్రభుత్వం యాప్, రాష్ట్ర ప్రభుత్వ యాప్‌లో ఈ పొరపాటు జరిగింది. రైతులు రెండు యాపుల్లో బుక్ చేసుకోవడంతో బస్తాల సంఖ్యలో తేడా కనిపిస్తుంది. ఇంకా 90 బస్తాలు నిల్వ ఉన్నట్లు యాప్‌లో కనిపిస్తుంది. మరోసారి యాప్ ఓపెన్ కాలేదు. కొందరి రైతులకు ఇచ్చారు. ఇలాంటి పొరపాటు చేయొద్దని నిర్వాహకులకు తెలిపాం. టెక్నికల్ ఇష్యూస్ వస్తే మా దృష్టికి తీసుకురావాలని సూచించాం.
– దుర్గారాజు, వ్యవసాయాధికారి, చందుర్తి


