ముస్తాబాద్(సిరిసిల్ల): రైతులకు యూరియా సరఫరాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపలమయ్యాయని నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు పేర్కొన్నారు. ముస్తాబాద్ బీఆర్‌ఎస్ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. యాప్‌ల ద్వారా యూరియా బుకింగ్ సరికాదన్నారు. రైతులకు ఆండ్రాయిడ్ ఫోన్లు ఎలా వాడాలో తెలియదని, కొన్ని పల్లెల్లో నెటవర్క్ కూడా పనిచేయదన్నారు. పాత పద్ధతిలోనే యూరియా అందించాలని కోరా రు. సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి, సర్వర్, సంతోష్‌రావు, భరత్, నల్లనర్సయ్య, స్వామి, కోడె శ్రీను, గణేశ్, ప్రశాంత్ ఉన్నారు.
పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించాలి
సిరిసిల్ల: పదహారేళ్ల లోపు పిల్లలకు సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించాలని బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ కోరారు. జిల్లా కేంద్రంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. స్మార్ట్‌ఫోన్ వినియోగంతో తీవ్రప్రభావం చూపుతుందన్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనమన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కులు, బాల్య వివాహ నిరోధంపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. గాయని తేలు విజయ, సామాజిక కార్యకర్త, బాలల హక్కుల ప్రజావేదిక జిల్లా ఇన్‌చార్జి వేముల మార్కండేయలు, ప్రజావేదిక ప్రతినిధి మంగలి చంద్రమౌళి, సుమంత్, ఉమేశ్ పాల్గొన్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
సిరిసిల్లటౌన్: గ్రామపంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌చౌరస్తాలో బుధవారం మహాధర్నాలో మాట్లాడారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనం రూ.26వేలు అందిస్తూ.. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని, హెల్త్‌కార్డులు అందించాలని కోరారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఎగమంటి ఎల్లారెడ్డి, అన్నల్దాస్ గణేష్, బూర శ్రీని వాస్, మల్యాల నర్సయ్య, లోకిని శ్రీనివాస్, రవీందర్, నర్సయ్య, మహేష్, శేఖర్, అనిల్, కాంతయ్య, లక్ష్మి, పద్మ పాల్గొన్నారు.
యాప్‌లో బుక్ చేసినా అందని యూరియా
సిరిసిల్ల అర్బన్: పెద్దూరులో యూరియా కోసం రైతులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. యాప్‌లో యూరియా బుక్ చేసినా సింగిల్‌విండోలో మాత్రం రైతులకు సరిపడ అందుబాటులో ఉండడం లేదు. ఇప్పటికైనా బుక్ చేసిన రైతులకు సరిపడే యూరియాను సింగిల్‌విండోలో అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.
2న గురుకులంలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ
సిరిసిల్ల/తంగళ్లపల్లి: గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో తాత్కాలిక ప్రాతిపదికన బోధన పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 2న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వరంగల్–కరీంనగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి డి.ఎస్.వెంకన్న బుధవారం తెలిపారు. డిగ్రీ లెక్చరర్(మహిళా కళాశాల)లో ఫ్యాషన్ డిజైన్ (3), ఇంటీరియర్ డిజైన్ (1), డిజిటల్ ఇమేజింగ్ ఫొటోగ్రఫీ(1), టీజీటీ (మానాల పాఠశాల)లో ఫిజికల్ సైన్స్ (1) ఉన్నాయి. లెక్చరర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీజీతోపాటు రెండేళ్ల బోధన అనుభవం ఉండాలి. టీజీటీ పోస్టులకు డిగ్రీతోపాటు బీఈడీ, టెట్ అర్హత తప్పనిసరి. సెప్టెంబర్ 2న ఉదయం 9 గంటలకు తంగళ్లపల్లి గిరిజన సంక్షేమ డిగ్రీ మహిళా కళాశాలలో హాజరుకావాలని తెలిపారు.


