సిరిసిల్ల: చిన్నపాటి వర్షానికే జిల్లా కేంద్రం వణికిపోతుంది. పాతబస్టాండులోని నేతన్నచౌక్ చిత్తడిగా మారుతుంది. ఊరిలోని వరద నీరంతా నేతన్నచౌక్‌కు చేరి చెరువును తలపిస్తుంది. డ్రెయినేజీలోని మురికి రోడ్డు ఎక్కుతుంది. వర్షం పడిన ప్రతిసారి ఇదే దుస్థితి. ఇప్పటికై నా మున్సిపల్ పాలకవర్గం, యంత్రాంగం శ్రద్ధ చూపి స్వచ్ఛ సిరిసిల్లకు మచ్చ తెస్తున్న నేతన్న చౌక్ మురికి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఐదు మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. సిరిసిల్లలో 1.2 మిల్లీమీటర్లు, ఇల్లంతకుంటలో 1.3, ముస్తాబాద్‌లో 0.4, వీర్నపల్లిలో 0.8, ఎల్లారెడ్డిపేటలో 0.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మిగతా మండలాల్లో మేఘావృతమైనా.. పొడి వాతారణం నెలకొంది.


