కోనరావుపేటలో 14.7 మి.మీ వర్షం | - | Sakshi
Sakshi News home page

కోనరావుపేటలో 14.7 మి.మీ వర్షం

Aug 26 2026 12:24 AM | Updated on Aug 26 2026 12:24 AM

సిరిసిల్ల: జిల్లా అంతటా మంగళవారం చిరుజల్లుల వర్షం కురిసింది. జిల్లాలోని కోనరావుపేటలో అత్యధికంగా 14.7 మిల్లీ మీటర్ల వర్షం పడగా, రుద్రంగి 6.5, చందుర్తి 1.3, వేములవాడరూరల్‌ 6.2, బోయినపల్లి 7.6, వేములవాడ 5.1, సిరిసిల్ల 7.4, వీర్నపల్లి 8.6, ఎల్లారెడ్డిపేట 3.6, గంభీరావుపేట 2.9, ముస్తాబాద్‌ 3.2, తంగళ్లపల్లి 13.8, ఇల్లంతకుంటలో 7.1 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది. జిల్లా అంతటా సగటు వర్షపాతం 6.8 మి.మీ వర్షం కురిసింది. భారీ వర్షాలు లేక జిల్లాలోని చెరువులు కుంటల్లో ఇంకా పూర్తి స్థాయిలో నీరు చేరలేదు.

ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలి

వేములవాడ: మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆయా మజీద్‌ల పెద్దలు, టౌన్‌ కమిటీ అధ్యక్షులు, ఇతర నాయకులతో మంగళవారం పీస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇతర మతాలను గౌరవిస్తూ తమ సంప్రదాయం ప్రకారం వేడుకలు జరుపుకోవాలని సూచించారు. మజీద్‌ల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. టౌన్‌ సీఐ వీరప్రసాద్‌, ఎస్సై రాహుల్‌రెడ్డి, టౌన్‌ కమిటీ అధ్యక్షుడు అక్రమపాషా, సెక్రటరీ షాహిద్‌, మజీద్‌ కమిటీల అధ్యక్షులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

అన్నదాతకు అండగా ప్రజాప్రభుత్వం

ముస్తాబాద్‌(సిరిసిల్ల): అన్నదాతకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని ఆత్మ సిరిసిల్ల డివిజన్‌ కమిటీ చైర్మన్‌ కొండం రాజిరెడ్డి అన్నారు. మంగళవారం ముస్తాబాద్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత ఉండదని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా అవగాహన కల్పించాలన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, మక్క, పెసర, జొన్న, పామాయిల్‌ వంటివి సాగు చేసేలా చూడాలన్నారు. రైతుబంధు, బీమా, ఉచిత విద్యుత్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, హర్టికల్చర్‌ అధికారి శరత్‌బాబు, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, ఆత్మ డైరెక్టర్లు కొండల్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలి

సిరిసిల్లటౌన్‌: జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం బీవైనగర్‌ పార్టీ ఆఫీసులో గ్రామపంచాయతీ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ యూని యన్‌ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు బూర శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఎల్లారెడ్డి మాట్లాడుతూ, కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనే లక్ష్యంగా బుధవారం పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ధ ర్నా చేపడుతామని, కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి కోడం రమణ, మల్యాల నర్సయ్య, వర్కోలు మల్లయ్య, లోకిని శ్రీనివాస్‌, కంసాని రవీందర్‌, మహేశ్‌, శేఖర్‌, అనిల్‌, కాంతయ్య పాల్గొన్నారు.

దరఖాస్తులు ఆహ్వానం

సిరిసిల్ల: యువతలోని నైపుణ్య ప్రతిభను వెలికి తీసేందుకు నిర్వహిస్తున్న స్కిల్‌ ఇండియా కాంపిటీషన్స్‌ 2026– 27కు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని ప్రభుత్వ ఐటీఐ ఏటీసీ ప్రిన్సిపాల్‌ ఎస్‌.కవిత తెలిపారు. ఈ పోటీల్లో 63 రకాల నైపుణ్య విభాగాల్లో అభ్యర్థులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. అర్హత గల అభ్యర్థులు స్కిల్‌ ఇండియా డిజిటల్‌ హబ్‌ ద్వారా ఉచితంగా పేర్లు నమోదు చేసుకోవచ్చని వివరించారు. అభ్యర్థులు స్కిల్‌ ఇండియా డిజిటల్‌ హబ్‌లో మొబైల్‌ నంబర్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకుని ఓటీపీ ధ్రువీకరణ, ఆధార్‌ ఈ కేవైసీ పూర్తి చేసిన తర్వాత డాష్‌ బోర్డులో ఇండియా స్కిల్‌ కాంపిటీషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. పోటీలకు 16 నుంచి 21 ఏళ్ల వయసున్నవారు దరఖాస్తు చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement