మండలంలోని కస్బేకట్కూర్ గ్రామం చింతలపల్లి చెరువులో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. ఇటీవల చెరువులో మట్టి తీయడంతో మూడుస్తంభాలు ఒక్కసారిగా పక్కకు వంగిపోయాయి. చింతల్లపల్లె గ్రామానికి ఈ లైన్ ద్వారానే విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఈ స్తంభాలు ఏ క్షణంలోనైనా నీటిలో విరిగిపడే అవకాశం ఉందని, అదే జరిగితే గ్రామానికి కరెంట్ సరఫరా నిలిచిపోతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్‌శాఖ అధికారులు స్పందించి స్తంభాలను సరిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. – తంగళ్లపల్లి


