ఒకరి నేత్రదానం.. ఇద్దరి జీవితాల్లో వెలుగు | - | Sakshi
Sakshi News home page

ఒకరి నేత్రదానం.. ఇద్దరి జీవితాల్లో వెలుగు

Aug 26 2026 12:18 AM | Updated on Aug 26 2026 12:18 AM

సిరిసిల్ల: నేత్రదానం.. మహాదానమని, మనిషి జీవితం ముగిసినా.. కళ్లు మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపుతాయని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి వద్ద మంగళవారం జాతీయ అంధత్వం, దృష్టి లోపాల నివారణలో భాగంగా 41వ నేత్రదాన పక్షోత్సవాలను నిర్వహించారు. ఈనెల 25 నుంచి సెప్టెంబర్‌ 8 వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన ర్యాలీలు, కార్యక్రమాలను నిర్వహిస్తామని డీఎంహెచ్‌వో తెలిపారు. నేత్రదానంపై ప్రజల్లో అపోహలు తొలగించేందుకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా ఆస్పత్రి ఇన్‌చార్జి పర్యవేక్షకులు డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు మాట్లాడుతూ, మరణానంతరం నేత్రదానానికి కుటుంబ సభ్యలు ముందుకు రావాలన్నారు. బీపీ, క్షయ, ఉబ్బసం ఉన్నవారు, కళ్లద్దాలు ఉపయోగించేవారు, శుక్లాల శస్త్రచికిత్స చేయించుకున్నవారు నేత్రదానం చేయవచ్చని వివరించారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ తేజస్విని , జిల్లా అంధత్వ నివారణ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ నయీం జహా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement