వేములవాడ: పర్యావరణ పరిరక్షణకు సమష్టిగా కృషి చేద్దామని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అన్నారు. ఈకో ఫాన్ సొసైటీ, రాష్ట్ర అటవీశాఖ సంయుక్తంగా కలుపు మొక్కల నియంత్రణ, అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, విదేశీ కలుపు మొక్కలు నేలలోని సారాన్ని పిండేసి స్థానిక జాతులకు చెందిన చెట్లు, మొక్కలు పెరగకుండా అడ్డుకుంటాయన్నారు. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడంతో పాటు పట్టణంలోని ప్రజాస్థలాలను శుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అన్నారు. మున్సిపల్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు భాగస్వాములై కలుపు మొక్కల నియంత్రణకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కమిషనర్ లోకేశ్, మెట్టుసాయి సంపత్, తలారి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.


