నిమ్మపల్లిలో యువకుడిపై కత్తులతో దాడి | - | Sakshi
Sakshi News home page

నిమ్మపల్లిలో యువకుడిపై కత్తులతో దాడి

Aug 16 2026 11:29 PM | Updated on Aug 16 2026 11:29 PM

కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లికి వలస వచ్చిన మహిళ కుమారుడు అజయ్‌పై సురేష్‌ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. కత్తి పోట్లు కడుపులో బలంగా దిగడంతో తీవ్ర గాయాలపాలైన అజయ్‌ని 108 అంబులెన్స్‌లో సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా సంఘటన స్థలాన్ని కోనరావుపేట ఎస్సై ప్రశాంత్‌రెడ్డి సందర్శించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని, అమ్మాయి సోదరుడు కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా కోనరావుపేట మండలంలో పది రోజుల వ్యవదిలోనే మూడు సంఘటనలు జరిగాయి. ఆగస్టు 8న మల్కపేటలో గొడ్డలితో దాడి, 12న వట్టిమల్ల గొల్లపల్లిలో పారతో తాడి, తాజాగా నిమ్మపల్లిలో కత్తులతో దాడి.. వరుస సంఘటనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement