రామగిరి: మండలంలోని బేగంపేట శివారు తాటివనం వద్ద గల పెద్దమ్మ తల్లి ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమ్మ ఆలయాన్ని శుభ్రం చేసేందుకు ఉదయం మధునమ్మ అనే మహిళ వెళ్లగా ఆలయ తలుపులు, తాళాలు పగులగొట్టి హుండీని ధ్వంసం చేయడంతో ఆలయ చైర్మన్ బొంతల రవికి సమాచారం అందించింది. పూజారి, చైర్మన్ కలిసి ఆలయాన్ని పరిశీలించారు. పోలీసులకు సమాచారం అందించగా మంథని సీఐ బి.స్వామి, రామగిరి ఎస్సై తాడవేని శ్రీనివాస్ పరిశీలించి క్లూస్‌టీంతో వివరాలు సేకరించారు. ఆలయ చైర్మన్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తాడవేని శ్రీనివాస్ తెలిపారు.


