జ్ఞాపకాల్లో వేములవాడ | - | Sakshi
Sakshi News home page

జ్ఞాపకాల్లో వేములవాడ

Aug 16 2026 11:29 PM | Updated on Aug 16 2026 11:29 PM

వేములవాడ: ఆధ్యాత్మిక పట్టణం వేములవాడ అలనాటి చిత్రాలు ముచ్చటగొలుపుతున్నాయి. రాజరాజేశ్వరస్వామి ఆలయం కాలక్రమంలో జరిగిన అభివృద్ధి పనులు.. పట్టణ రూపురేఖలు.. ఆనాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తున్నాయి. 1970లో వేములవాడ దేవస్థాన అభివృద్ధి పనులు నాటి కాంట్రాక్టర్‌ చేదురువెల్లి రామస్వామి ఆధ్వర్యంలో జరిగిన నిర్మాణ విశేషాలు ఇవీ..

ధర్మగుండం

ధర్మగుండం ఫిబ్రవరి 20, 1971లో నిర్మించారు. నాడు భక్తుల కోసం ధర్మగుండం మెట్లు, కాంక్రీట్‌వాల్‌ నిర్మిస్తున్న అరుదైన ఫొటోలు లభించాయి. పారపట్టి, రాళ్లు మోసి ఆలయానికి పునాది వేసిన శ్రామికుల కష్టానికి నిదర్శనంగా నిలుస్తోంది.

కమాన్‌ ప్రారంభోత్సవం

మార్చి 6, 1973న వేములవాడ ఆలయ స్వాగత తోరణం(కమాన్‌) పనులు పూర్తయ్యాయి. నాడు కట్టిన పునాదులే నేడు లక్షలాదిమందికి ఆధ్యాత్మిక నిలయాలుగా నిలుస్తున్నాయి. స్వాగత తోరణంఅర్ధ శతాబ్దం పూర్తి చేసుకుంది. మనం చూస్తున్న ఈ వైభవం వెనుక ఎందరో కృషి దాగి ఉంది. మనం అనుభవిస్తున్న నేటి సౌకర్యాల వెనుక మన పూర్వీకులు చిందించిన చెమటచుక్కల ఫలితమే.

ఒకనాటి వేములవాడ స్వాగత తోరణం

ఆనాటి ఊరి ముఖద్వారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement