జిల్లాలో ఐసీసీ కమిటీలు ఏర్పాటు చేశాం. ఏమైనా ఫిర్యాదు రాగానే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని శాఖల నుంచి లిఖితపూర్వకంగా కమిటీల వివరాలు సేకరిస్తున్నాం. ఇవి బహిర్గతం చేయకూడదు కాబట్టి ప్రచారం చేయడం లేదు. ‘షీ బాక్స్’కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేస్తే నేరుగా మాకు చేరుతుంది. దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తాం.
– లక్ష్మీరాజం, జిల్లా సంక్షేమ అధికారి
నేరుగా ఫిర్యాదు చేయొచ్చు
ప్రభుత్వ ఆఫీస్‌లు, ప్రైవేటు ఆఫీస్‌లు, పనిచేసే చోట మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే.. నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయండి. జిల్లాలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాం. కాలేజీ స్థాయిలోనూ ‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’పై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో షీటీమ్ పనిచేస్తుంది. ఎవరైనా ఎక్కడైనా లైంగికంగా వేధిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. – మహేశ్ బీ గీతే, ఎస్పీ


