మా‘నీరి’ంకి.. గడ్డి మొలచి ! | - | Sakshi
Sakshi News home page

మా‘నీరి’ంకి.. గడ్డి మొలచి !

Oct 5 2026 1:33 AM | Updated on Oct 5 2026 1:33 AM

సిరిసిల్ల: సిరిసిల్ల మానేరు వాగు.. ఒకప్పుడు ఏడాదిలో ఎనిమిది నెలలపాటు నీటితో పారే జీవనది. ఇసుక తవ్వి.. తవ్వీ.. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. సిరిసిల్ల మానేరువాగులో మట్టిదిబ్బలు తేలాయి. పబ్బచెట్లు.. తుంగతో నిండి ఉండే.. మానేరు ఇప్పుడు తేలిన మట్టితో గడ్డి మొలచింది. మధ్యమానేరు జలాశయం బ్యాక్‌వాటర్‌ సైతం ఎత్తిపోతలతో ఎగువ ప్రాంతాలకు తరలిపోతుండగా సిరిసిల్ల బతుకమ్మ ఘాట్‌ వద్ద గడ్డి దిబ్బలతో మానేరు వాగు ఇలా దర్శనమిస్తోంది.

ముందస్తు బతుకమ్మ సంబరాలు

వేములవాడ: వేములవాడలో ఆదివారం ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులు ప్రారంభం కానుండడంతో పాఠశాల ప్రాంగణంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో రమాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల పర్యవేక్షకులు వెంకటలక్ష్మి, పూజిత, ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయ బృందం, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement