ఆఫీసుల్లో కీచకులు ! | - | Sakshi
Sakshi News home page

ఆఫీసుల్లో కీచకులు !

Oct 5 2026 1:33 AM | Updated on Oct 5 2026 1:33 AM

‘ఆమె’ను వేధిస్తున్నారు ఒంటరిగా ఉంటే సూటిపోటీ మాటలు పరువుపోతుందని కుమిలిపోతున్న అతివలు జిల్లాలో ఐసీసీ అమలు జాడేదీ ?

జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ ఆఫీస్‌కు పొరుగు జిల్లా నుంచి ఓ మహిళా అధికారి వచ్చారు. ఆమె ఒంటరిగానే ఉంటూ జిల్లాలో పనిచేస్తుంది. ఆమె భర్త స్థానికంగా లేకపోవడంతో ఆఫీస్‌లోనే పనిచేసే ఓ ఉద్యోగి కన్నుపడింది. ఆమె ఏ పని చెప్పినా.. సదరు పురుష ఉద్యోగి ఏదో వంక పెడుతుండేవాడు. దీనిపై ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలేమీ తీసుకోలేదు. సదరు ఉద్యోగి మరింత కోపాన్ని పెంచుకొని ఆమెను లైంగికంగా, మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. దీంతో విసిగి పోయిన సదరు అధికారి సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో కౌన్సెలింగ్‌ చేశారు.

అది సిరిసిల్ల ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీస్‌. ఆ ఆఫీస్‌కు కొత్తగా మహిళా ఉద్యోగి ఒక్కరు వచ్చారు. విధి నిర్వహణలో ఎంతో చురుగ్గా పనిచేసే ఆ మహిళా ఉద్యోగిపై ఆ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీహరి ప్రసాద్‌ కన్నుపడింది. ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. మహిళా ఉద్యోగి సెల్‌ఫోన్‌కు రాత్రి వేళల్లో అసభ్యకరంగా మెసేజ్‌లు చేశారు. ఎఫ్‌ఆర్‌వో వేధింపులు భరించలేక ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆధారాలను పరిశీలించిన ఉన్నతాధికారులు సదరు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీహరిప్రసాద్‌ను సస్పెండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement