సిరిసిల్ల: 80వ స్వాతంత్య్ర వేడుకలకు జిల్లా పోలీస్ పరేడ్‌గ్రౌండ్ సిద్ధమైంది. అడ్మిన్ ఆర్‌ఐ సురేశ్ నాయకత్వంలో సుమారు 50 మంది పోలీస్ సిబ్బంది రిహార్సల్స్‌లో పాల్గొన్నారు. వీరి రిహార్సల్స్‌ను ఎస్బీ డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. మార్చ్‌ఫాస్ట్, జెండా వందనం, గౌరవ వందనం వంటి అంశాలపై పలుమార్లు సాధన చేశారు. ఏర్పాట్లను ఎస్పీ మహేశ్ బీ గీతే పరిశీలించారు. పోలీస్ పరేడ్ మైదానం, వేదిక, పరేడ్ నిర్వహణ, వివిధ శాఖల శకటాల ప్రదర్శన, ప్రజాప్రతినిధులు, ప్రెస్, అధికారులు, విద్యార్థుల సీట్ల ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ గురించి తెలుసుకున్నారు. ఎస్బీ డీఎస్పీ గాండ్ల వెంకటేశ్వర్లు, సీఐ రవి, ఆర్‌ఐలు మధుకర్, సురేశ్, సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్‌రావు ఉన్నారు. శుక్రవారం సాయంత్రం అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. జాతీయ జెండా ఆవిష్కరించే వేదిక, వీఐపీ, మీడియా, ప్రజల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలను పరిశీలించారు. ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరవుతారు.
షెడ్యూల్ ఇలా..


