పున్నం చందర్‌కు అవార్డు | - | Sakshi
Sakshi News home page

పున్నం చందర్‌కు అవార్డు

Aug 15 2026 12:28 AM | Updated on Aug 15 2026 12:28 AM

సిరిసిల్లటౌన్‌/సిరిసిల్లఅర్బన్‌: పున్నంచందర్‌ ‘బెస్ట్‌ సైకాలజిస్టు ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకున్నారు. సోషల్‌ జస్టిస్‌ ఫర్‌ వరల్డ్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో హైదరా బాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో అవా ర్డు అందజేశారు. మానసిక ఆరోగ్యరంగంలో అందిస్తున్న సేవలు, కౌన్సెలింగ్‌ ద్వారా చేనేత, పవర్‌లూమ్‌ కార్మికుల ఆత్మహత్యల నివారణకు పదహారేళ్లుగా చేస్తున్న కృషిని అభినంది స్తూ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ సంస్థ జాతీయ అధ్యక్షుడు కొప్పుల విజయకుమార్‌, జాతీయ ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు రాములు, విమెన్‌ సేఫ్టీ తెలంగాణ వింగ్‌ సురేఖ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

రైతు సంక్షేమమే లక్ష్యం

ఇల్లంతకుంట(మానకొండూర్‌): రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మానకొండూ రు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఇల్లంతకుంట ప్యాక్స్‌ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడారు. కాంగ్రెస్‌లో విధేయత నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలకు పదవులు వస్తాయన్నారు. ఇల్లంతకుంట సొసైటీకి గోదాం నిర్మాణానికి స్థలం మంజూ రు చేస్తానని పాలకవర్గానికి హామీ ఇచ్చారు. మానకొండూరు నియోజకవర్గంలోని 11 సొసైటీలకు నామినేటెడ్‌ కార్యవర్గాలను నియమించినట్లు పేర్కొన్నారు. ప్యాక్స్‌ చైర్మన్‌ వి.వెంకటరమణారెడ్డి, వైస్‌ చైర్మన్‌ యాస తిరుపతి, ఇల్లంతకుంట సర్పంచ్‌ మామిడి రాజు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ప్యాక్స్‌ కార్యదర్శి చిట్టి రవీందర్‌రెడ్డి, ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, గుడిసె ఐలయ్య, తీగల పుష్పలత పాల్గొన్నారు.

17 నుంచి జిల్లా ఆస్పత్రిలో సదరం శిబిరాలు

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో సదరం శిబిరాలను నిర్వహిస్తున్నామని జిల్లా ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు. ఆగస్టు 17, 18 తేదీల్లో ఎముకల(ఆర్థోఫెడిక్‌), 19న వినికిడి లోపం ఉన్నవారికి, 20న జనరల్‌ వైద్యపరీక్షలు, 21న కంటిచూపు వైద్యపరీక్షలు చేయనున్నట్లు వివరించారు. యూడీఐడీ దరఖాస్తు ఫామ్‌తోపాటు ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటో, మొబైల్‌ఫోన్‌, సంబంధిత మెడికల్‌ డాక్యుమెంట్లు, ఎక్స్‌రే వంటి వాటిని తీసుకుని సదరం శిబిరాలకు రావాలని కోరారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

కోనరావుపేట: మండలంలోని నిజామాబాద్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు పోతుగంటి శ్రీనివాస్‌ తెలి పారు. అండర్‌–15 విభాగంలో జిల్లాస్థాయిలో జరిగిన సుబ్రతో ఫుట్‌బాల్‌ కప్‌ 2026 టోర్నమెంట్‌లో నిజామాబాద్‌ పాఠశాలకు చెందిన 16 మంది విద్యార్థులు ప్రతిభ కనబర్చారన్నా రు. రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఎస్జీఎఫ్‌ సెక్రెటరీ రవీందర్‌రావు తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను సర్పంచ్‌ సింగం శ్రీహరి, పీడీ అజయ్‌ కుమార్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement