క్విట్‌ ఇండియా స్ఫూర్తితో జైల్‌భరో | - | Sakshi
Sakshi News home page

క్విట్‌ ఇండియా స్ఫూర్తితో జైల్‌భరో

Jul 27 2026 2:18 AM | Updated on Jul 27 2026 2:18 AM

సిరిసిల్లటౌన్‌: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా క్విట్‌ ఇండియా స్ఫూర్తితో జైల్‌ భరో కార్యక్రమాన్ని చేపడుతున్నామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ అన్నారు. ఆదివారం బీవైనగర్‌లోని పార్టీ కార్యాలయంలో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు సూరం పద్మ, జిల్లా నాయకులు కోల శ్రీనివాస్‌, జిందం కమలాకర్‌, బింగి సంపత్‌, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement