వేములవాడ మూలవాగుపై మూడో బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్నాయి. ‘ముచ్చటగా’ మూడుసార్లు నిర్మాణ దశలోనే కూలిపోయి తీవ్ర విమర్శలపాలైన ఈ వంతెన.. నేడు పటిష్టంగా రూపుదిద్దుకుంది. గతంలో కాంట్రాక్టర్ల అజాగ్రత్త, ఇంజినీరింగ్ లోపాల వల్ల వంతెన కూలిపోవడంతో ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. విప్ ఆది శ్రీనివాస్ చొరవతో లోపాలను సరిదిద్ది రూ.6 కోట్లు మిగులు పనులకు, రూ.6.90 కోట్లు భూసేకరణకు నిధులు మంజూరు చేయించి పనులు వేగవంతం చేశారు. మూడో బ్రిడ్జి అందుబాటులోకి వస్తే రాజన్న భక్తులు, స్థానికులకు మూలవాగు వద్ద ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. – వేములవాడ


