సిరిసిల్లటౌన్: కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్‌ను భారత సేనలు మట్టికరిపించిన విజయ్ దివస్ జూలై 26 దేశ గౌరవానికి ప్రతీక అని మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్ అన్నారు. బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో పట్టణంలోని కార్గిల్‌లేక్‌పై వైజయంతి యుద్ధ ట్యాంకు వద్ద అమర జవాన్లకు నివాళి అర్పించారు. 1999లో కార్గిల్ యుద్ధంలో మన సైనికులు ధైర్యంతో పోరాడి 527 మంది వీరులు తమ ప్రాణాలు అర్పించారన్నారు. అనంతరం పట్టణంలోని మాజీ సైనికులను సన్మానించారు. కౌన్సిలర్ ఎర్రం వెంకట్రాజం, ఎర్రం మహేశ్, శీలం రాజు, నవీన్‌యాదవ్, నాగుల శ్రీనివాస్, గాజుల వేణు, వేముల వైశాలి, మోర శ్రీహరి, అంకారాపు రాజు, చేపూరి అశోక్, ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.


