● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి (వేములవాడ): రెండు జిల్లాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభించినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం చందుర్తి మండలం ఎన్గల్ గ్రామం నుంచి నిజాబామాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రం వరకు బస్సును ప్రారంభించి మాట్లాడారు. సుమారు 20 ఏళ్ల తర్వాత ఈ మార్గంలో మళ్లీ బస్సు సర్వీస్ ప్రారంభం కావడం హర్షణీయమన్నారు. ప్రజా ప్రభుత్వంలో వేములవాడ డిపోకు 20 కొత్త బస్సులు అందించామన్నారు. వాటి ద్వారా గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను విస్తరిస్తున్నట్లు వివరించారు. సర్పంచ్ అసనిపర్తి శోభారాణి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, పార్టీ మండల అధ్యక్షుడు గొట్టే ప్రభాకర్, జిల్లా పధాన కార్యదర్శి షేక్ ఫిరోజ్ పాషా, నాయకులు గసికంటి ప్రభాకర్, లాండే తిరుపతి, ఎదురుగట్ల అజయ్ తదితరులు పాల్గొన్నారు.


