బోయినపల్లి(చొప్పదండి): ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రమాదకర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. కొదురుపాక చౌరస్తాలో ప్ర మాదాలు జరిగే బ్లాక్‌స్పాట్స్‌ను గురువారం పరిశీలించారు. ప్రమాదాలకు దారితీసే కారణాలను.. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మలుపుల వద్ద హెచ్చరికబోర్డులు ఏర్పాటు చే యడం, స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని ఆదేశించారు. అనంతరం మాన్వాడ వద్ద గల మిడ్‌మానేరు ప్రాజెక్టును పరిశీలించారు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై ఎన్.రమాకాంత్ ఉన్నారు.
సైబర్ వారియర్స్ స్పందించాలి
సిరిసిల్లటౌన్: సైబర్ వారియర్స్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అడిషనల్ ఎస్పీ చంద్రయ్య సూచించారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో గురువారం సైబర్ వారియర్స్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సైబర్ మోసాలకు గురైన వ్యక్తులు డబ్బు బ్యాంకులో ఫ్రీజ్ అయి ఉంటే వీలైనంత త్వరగా తిరిగి వచ్చేలా కృషి చేయాలన్నారు. ప్రజలు మోసపోతే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. సైబర్ ఆర్‌ఎస్సై జునైద్, సైబర్ వారియర్లు పాల్గొన్నారు.
బోయినపల్లి(చొప్పదండి): ప్రయాణికులను గూడ్స్ వాహనాల్లో తరలించొద్దని.. ఒక్కోసారి ప్రాణాపాయానికి దారితీస్తోందని ఎంవీఐ వంశీధర్ తెలిపారు. మండలంలోని వెంకట్రావుపల్లి పరిసరాల్లో గురువారం తనిఖీలు నిర్వహించి.. కూలీలను తరలిస్తున్న మూడు గూడ్స్ వా హనాలను సీజ్ చేశారు. అనంతరం సమీపంలోని పొలాల్లో వరి నాట్లు వేస్తున్న కూలీలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని శ్రీగాథ నుంచి సిరిసిల్ల వరకు వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను మూడేళ్ల తర్వాత గురువారం పునరుద్ధరించారు. మూడేళ్లుగా నిలిచిన బస్సు సర్వీస్ తిరిగి ప్రారంభం కావడంతో విద్యార్థుల ప్రయాణ కష్టాలు తీరాయి. బస్సు సౌకర్యం లేక విద్యార్థులు నిత్యం నడిచి స్కూల్, కాలేజీలకు వెళ్లేవారు. ప్రజల విజ్ఞప్తులు, విద్యార్థుల సమస్యలను పరిగణనలోకి తీసుకున్న ఆర్టీసీ అధికారులు మూడేళ్ల తర్వాత బస్సు సర్వీస్‌ను పునరుద్ధరించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ వేముల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌కు అదనపు బస్సులు నడపాలని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ కోరారు. ఈమేరకు డిపో మేనేజర్ ప్రకాశ్‌రావుకు గురువారం వినతిపత్రం అందించి మాట్లాడారు. వేములవాడ నుంచి వచ్చే బస్సులు అక్కడే నిండిపోవడంతో సిరిసిల్లలో ప్రయాణికులకు సీట్లు దొరకడం లేదన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సిరిసిల్ల డిపో నుంచి ఉదయం 4 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అదనపు బస్సు సర్వీసులను ప్రారంభించాలని కోరారు. మట్టే శ్రీనివాస్, ఆరెల్లి వినయ్‌కుమార్, మల్యాల ప్రవీణ్, శివ, శశి, అనిరుధ్, రాజు తదితరులు పాల్గొన్నారు.


