అడవిలో షికారి | - | Sakshi
Sakshi News home page

అడవిలో షికారి

Jul 17 2026 7:33 AM | Updated on Jul 17 2026 7:33 AM

‘ఇటీవల ఇల్లంతకుంట మండలంలో అడవిపందిని వేటాడి పట్టుకున్న వేటగాళ్లు ఆ మాంసాన్ని ఊరిలో విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ సెక్షన్‌ అధికారి మాంసం విక్రయిస్తున్న ప్రదేశానికి చేరగానే సదరు వ్యక్తి ద్విచక్రవాహనం, మాంసాన్ని వదిలేసి పరారయ్యాడు. అటవీశాఖ అధికారి వాహనాన్ని సీజ్‌ చేసి, మాంసాన్ని ల్యాబ్‌కు పరీక్షలకు పంపించారు.

‘కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన గంగారాం ఇటీవల అటవీ ప్రాంతంలో వలలు పెట్టి ఉడుములను పట్టి.. బహిరంగంగానే విక్రయించాడు. సమాచారం అందుకున్న వేములవాడ ఫారెస్ట్‌ అధికారులు మామిడిపల్లి అటవీ ప్రాంతంలో వారం రోజుల క్రితం తనిఖీ చేయగా.. గంగారాం వద్ద చనిపోయిన మరో ఉడుము లభించింది. దీంతో ఉడుమును స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్‌ అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు.’

ఇది ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి–మల్కపేట శివారు అడవుల్లో వేటగాళ్ల ఉరికి చిక్కిన ఉడుము. రెండు కిలోల బరువు ఉన్న ఉడుము అడుగుజాడలను ఒక్క రోజు ముందే గుర్తించి.. అది సంచరించే ప్రాంతంలో ఉరులు పెట్టారు. ఉడుము ఉరిలో చిక్కి గిలగిల కొట్టుకుంది. తెల్లవారి వేటగాళ్లు వచ్చి ఆ ఉడుమును గొడ్డలితో కొట్టి కాళ్లు విరగొట్టారు. దాన్ని బంధించి తెచ్చి, ఊరిలో రూ.వెయ్యికి విక్రయించారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement