● బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్
సిరిసిల్లటౌన్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మున్సిపల్ వైస్‌చైర్మన్ దార్ల సందీప్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల అవినీతి అక్రమాలను నిరసిస్తూ గురువారం మున్సిపల్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవసరం ఉన్న నేను ముందుంటానన్న కేటీఆర్ ఈరోజు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల అవినీతి, అక్రమాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మున్సిపల్ సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యేగా ఎందుకు హాజరు కావడం లేదన్నారు. కనీసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూడా అందుబాటులో ఉండడం లేదని విమర్శించారు. భూకబ్జాలు, సెటిల్‌మెంట్స్‌తో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు అక్రమార్జనకు తెరలేపారన్నారు. నా యకులు మేరుగు మంజుల, మామిడాల మహేశ్, ఊరకొండ రాజు, కొండ నరేశ్, ఎర్రం విజయ్, మ్యాన రాంప్రసాద్, ఆడెపు రవీందర్, సూరం వినయ్, మోర రవి, బూర విష్ణు పాల్గొన్నారు.


