సిరిసిల్లటౌన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజ య్‌కుమార్ శుక్రవా రం జిల్లాలో పర్యటించనున్నారు. షెడ్యూల్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి విడుదల చేశారు. సిరిసిల్లలో ఉదయం 10 గంటలకు భారత్ సోలార్ అండ్ డ్రోన్స్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 10:30 గంటలకు కార్గిల్ లేక్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 11 గంటలకు గంభీరావుపేట మండలం పొన్నాలపల్లె పంచా యతీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రాచర్లబొప్పాపూ ర్, ఎల్లారెడ్డిపేట, బండలింగంపల్లి, హరిదా స్‌నగర్‌లలో బీజేపీ నాయకులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ముస్తాబాద్ మండలం ఆవునూరులో పార్టీ మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతికుమార్ స్వగృహంలో భోజనం చేస్తారు. 2:30 గంటలకు కొండాపూర్‌లో, 3 గంటలకు గూడెంలో, 3:30 గంటలకు మొర్రాయిపల్లెలో పర్యటిస్తారు. సాయంత్రం 4 గంటలకు తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లి సర్పంచ్‌ను పరామర్శిస్తారు. సాయంత్రం 4:30 గంటలకు తాడూరులో పలువురిని పరామర్శిస్తారు.


