11 నుంచి విధుల బహిష్కరణ
యూనియన్ నాయకులు
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని సెస్ ఆఫీస్‌లోని అసిస్టెంట్ హెల్పర్స్, ఉద్యోగులు 72 గంటలపాటు విధుల బహిష్కరణకు పిలుపు నిచ్చారు. ఈమేరకు స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారంలో జాప్యానికి నిరసనగా ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు 72 గంటలు విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే సెస్ ఎండీకి ఐదు సార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించలేదన్నారు. ఎఫ్‌టీఏ ఎనిమిది నెలలుగా ఇవ్వడం లేదన్నారు. 2025 సెప్టెంబర్‌లో ఇవ్వాల్సిన యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబ సభ్యులను రెగ్యులరైజ్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సెస్ చైర్మన్, ఎండీలు సమస్యలు పరిష్కరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వర్‌రావు, నలువాల స్వామి, సెస్ కమిటీ అధ్యక్షుడు కర్నాల అనిల్‌కుమార్, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర మల్లేశం, కోశాధికారి రాంబాబు పాల్గొన్నారు.


