భీమన్నకు మొక్కులు.. రాజన్నకు ఆదాయం
వేములవాడ: సమ్మక్క జాతర సమీపిస్తుండడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బుధవారం 30వేల మంది భక్తులు దర్శించుకున్నారు. రద్దీని గమనించిన ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో కొందరు బ్రోకర్లు భక్తులకు దర్శనాలు కల్పిస్తామని డబ్బుల వసూలుకు పాల్పడుతున్నారని భక్తులు ఎస్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రసాదాల కౌంటర్ ప్రాంతంలో పాము కనిపించగా.. స్నేక్ క్యాచర్ జగదీశ్ వచ్చి బంధించి పట్టణ శివారు ప్రాంతంలో వదిలిపెట్టారు.
15 రోజుల్లో రూ.71.80 లక్షల ఆదాయం
రాజన్న ఖాతాకు రూ.71.80 లక్షల ఆదాయం హుండీల ద్వారా లభించింది. భీమన్న ఆలయానికి వచ్చిన భక్తులు 15 రోజుల్లో హుండీలలో వేసిన కట్నాలు, కానుకలను ఆలయ అధికారులు బుధవారం లెక్కించారు. రూ.71,80,529 నగదు, 35 గ్రాముల బంగారం, 3.100 కిలోల వెండి సమకూరినట్లు ఈవో రమాదేవి తెలిపారు. నాంపల్లి నర్సింహాస్వామికి 9 నెలల హుండీ ఆదాయం రూ.15,47,828 సమకూరినట్లు చెప్పారు.
భీమన్నకు మొక్కులు.. రాజన్నకు ఆదాయం
భీమన్నకు మొక్కులు.. రాజన్నకు ఆదాయం


