కాల్వ కబ్జా చేస్తుండ్రు
● అధికారులకు బాధితుల ఫిర్యాదు
వేములవాడ: వరద ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసేలా కాలువను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ వేములవాడలోని లాలపల్లిరోడ్డులోని సర్వేనంబర్ 81, 82, 83, 84లో 17 ఏళ్ల క్రితం యాదవులు ప్లాట్లుగా మార్చి విక్రయించారని, ఇప్పుడు వారే దేవాలయాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే కాలువను కబ్జా చేస్తున్నారన్నారు. ఈ అక్రమ నిర్మాణంతోపాటు తమ స్థలాల్లోకి 40 అడుగుల మేర ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్లాట్ల యజమానులు భూపతి, లక్ష్మణాచారి, నరసింహచారి, చంద్రమౌళి, రమణయ్య నిరసన తెలిపారు.


