రాష్ట్ర ఏర్పాటు తర్వాత బద్దెనపల్లికి తొలి ఎన్నికలు
తంగళ్లపల్లి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ గ్రామానికి సర్పంచ్ ఎన్నిక జరగలేదు. మండలంలోని బద్దెనపల్లి గ్రామపంచాయతీకి ఏడేళ్లుగా సర్పంచ్, పాలకవర్గం లేదు. రిజర్వేషన్ పేరుతో హైకోర్టులో కేసు ఉండడంతో ఏడేళ్లుగా ఎన్నికలు నిలిచిపోయాయి. 2013లో చివరిసారిగా ఆ గ్రామంలో ఎన్నికలు జరగగా అప్పటికీ రాష్ట్రం సిద్ధించలేదు. దీంతో తెలంగాణ వచ్చాక తొలిసారి వచ్చిన ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ సిలివేరి లావణ్య సర్పంచ్‌గా గెలుపొంది సోమవారం తహసీల్దార్, స్పెషల్ అధికారి జయంత్‌కుమార్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.
అక్రమ నిర్మాణం కూల్చివేత
సిరిసిల్లటౌన్: జిల్లాకేంద్రం శివారులోని కొత్తచెరువు మత్తడి కాలువలో అక్రమ నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. ఆదివారం సెలవు రోజున కాల్వను ఆక్రమిస్తూ కల్వర్టు నిర్మాణాన్ని ఓ ప్రైవేటు భూ యజమాని చేపట్టారు. ఏటా వర్షాకాలంలో కొత్తచెరువు పూర్తిగా నిండిపోయి భారీ వరద నీరు మద్దరి కాలువ ద్వారా సిరిసిల్ల మానేరు వాగులోకి వెళ్తుంది. కొన్నేళ్లుగా మత్తడి కాలువ కబ్జాలకు గురికావడంతో వరద నీరంతా పట్టణంలోకి ప్రవహిస్తుంది. ప్రైవేటు వ్యక్తులు మత్తడి కాలువను ఆక్రమిస్తూ స్తూ కల్వర్టు చేపట్టడంపై సోమవారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన మున్సిపల్ అధికారులు సోమవారం జేసీబీ ద్వారా అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. అనుమతి లేకుండా ఎవరు నిర్మాణాలు చేపట్టొద్దని, చెరువులు కాలువల స్థలం ఆక్రమణకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ఎం.ఏ ఖదీర్‌పాషా, డీపీవో సాయికృష్ణ తెలిపారు.
యోగా శిక్షకులకు దరఖాస్తుల ఆహ్వానం
సిరిసిల్లఅర్బన్: పీఎంశ్రీ పథకంలో భాగంగా జిల్లాలోని వివిధ పీఎంశ్రీ స్కూళ్లలోని విద్యార్థులకు యోగా శిక్షణ ఇచ్చేందుకు శిక్షకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి రాందాస్ కోరారు. 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు, అనుభవం గల వారు సర్టిఫికెట్లతో ఈనెల 23 నుంచి 27 వరకు పేర్లను నమోదు చేసుకొని, దరఖాస్తులు అందజేయాలని సూచించారు. వివరాలకు 94402 39783, 75692 07411లో సంప్రదించాలని తెలిపారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత బద్దెనపల్లికి తొలి ఎన్నికలు
రాష్ట్ర ఏర్పాటు తర్వాత బద్దెనపల్లికి తొలి ఎన్నికలు


