‘జ్యోతిష్మతి’లో వర్క్‌షాప్ ప్రారంభం
తిమ్మాపూర్: మండలంలోని జ్యోతిష్మతి (అటానమస్) కళాశాలలో ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీపై మూడు రోజుల జాతీయస్థాయి వర్క్‌షాప్‌ను సోమవారం ప్రారంభించారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహింంచనున్నట్ల కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, సెక్రటరీ , కరస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి తెలిపారు. ప్రిన్సిపాల్ టి.అనిల్ కుమార్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహన సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. డీన్ డా. పి.కె. వైశాలి విద్య, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాల అభివద్ధి ప్రాముఖ్యతను వివరించారు. హైఈఈ – ఎంపవరింగ్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. మదన్ మోహన్ గౌడ్ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తాజా సాంకేతిక పరిణామాలు, సవాళ్లు, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ వోడీ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


