స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
చందుర్తి(వేములవాడ): త్వరలోనే జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. చందుర్తిలో పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం పార్టీ నాయకులు ప్రతాప రామకృష్ణ, చెన్నమనేని వికాస్‌రావులతో కలిసి ప్రారంభించారు. గోపి మాట్లాడుతూ కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు గడపగడపకు తీసుకెళ్లాలని కోరారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు. ప్రతీ కార్యకర్త స్థానికసంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకునేందుకు సైనికునిల్లా పనిచేయాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు మోకిలే విజేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అల్లాడి రమేశ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ కోల కిష్టస్వామి, నియోజకవర్గ కన్వీనర్ మార్త సత్తయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్, సీనియర్ నాయకులు పడాల గణేశ్, పోంచేటి రాకేశ్, నంద్యాడపు వెంకటేశ్, మారుతి, వేణుగోపాల్, రాపెల్లి శ్రీధర్, చిలుముల హనుమయ్య, తీపిరెడ్డి మనోహర్‌రెడ్డి, మట్కం మల్లేశం, చింతకుంట గంగాధర్ పాల్గొన్నారు.
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి


