సంప్రదాయమే సనాతన ధర్మానికి ఊపిరి
● విజయశంకర స్వామీజీ
సిరిసిల్లటౌన్: సంకీర్తన సంప్రదాయమే సనాతన ధర్మానికి ఊపిరి అని అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి విజయశంకరస్వామీ పేర్కొన్నారు. సిరిసిల్ల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం సందర్శించగా అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. భక్తులనుద్దేశించి విజయశంకరస్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. మే 7న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే హైందవ భక్తి కళా సమ్మేళనం జయప్రదం చేయాలని కోరారు. అనంతరం పోస్టర్‌లను ఆవిష్కరించారు. సామాజిక సమరసత వేదిక జిల్లా కన్వీనర్ మోర శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కోడం రవి, రంగనాయకుల సంతోషుబాబు, హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అధికార ప్రతినిధి ఖదిజ్ఞాసి మల్లికావళ్లభ, వైద్యనిపుణులు సురసుర రాధాకృష్ణ, వికాస తరంగిణి భక్త బృందం సభ్యులు పెద్ది శ్రీనివాస్, పత్తిపాక శ్రీనివాస్, రాపెల్లి రాజేందర్, లవంతిక, రాజ్యలక్ష్మి, గురుకుల ఆశ్రమ హనుమాన్ భక్తులు వొడ్నాల సత్యం, ఏనుగుల శ్రీనివాస్, కల్లిపెల్లి భాస్కర్, భజరంగ్‌దళ్ కార్యకర్తలు గౌతమ్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.
15 నుంచి పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లెల్ల శివారులోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాలలో ఈనెల 15 నుంచి పుట్టగొడుగుల తయారీపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఏఈఎల్‌పీ డైరెక్టర్ డాక్టర్ జె.రాజేందర్ తెలిపారు. ఏఈఎల్‌పీ డైరెక్టర్ డాక్టర్ జె.రాజేందర్ మాట్లాడుతూ ముత్యపుచిప్ప పాలపుట్ట గొడుగులు సాగుచేయడంపై ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారికి స్పాన్, బెడ్ తయారీపై శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ అందజేస్తామని తెలిపారు. వివరాలకు 90140 99365, 93811 04250లో సంప్రదించాలని కోరారు.
వేములవాడ ఆస్పత్రిలో మోకీలు మార్పిడీ ఆపరేషన్లు
వేములవాడఅర్బన్: స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఆదివారం ఇద్దరికి మోకీలు మార్పిడీ ఆపరేషన్లు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య తెలిపారు. పెంచలయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రాంతీయ ఆస్పత్రుల్లో మోకీలు మార్పిడీ ఆపరేషన్లకు వేములవాడ ఏరియా ఆస్పత్రి ప్రసిద్ధి చెందిందన్నారు. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 42 మోకీలు మార్పిడీ ఆపరేషన్లు చేసినట్లు తెలిపారు. వైద్యులు అనిల్‌కుమార్, శశికాంత్, మత్తు వైద్యులు తిరుపతిలను అభినందించారు.
కార్మికులకు పని కల్పించాలి
● ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాములు
సిరిసిల్లటౌన్: జిల్లాలో భవన కార్మికులకు పనుల్లేక పస్తులుంటున్నారని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ కార్మిక భవన్‌లో ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్లో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఇసుక, మొరం పర్మిషన్లు ఇవ్వాలని కోరారు. కార్మికులకు పనులు దొరక్క తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజ్జ వేణు, సదానందం పాల్గొన్నారు.
సంప్రదాయమే సనాతన ధర్మానికి ఊపిరి
సంప్రదాయమే సనాతన ధర్మానికి ఊపిరి
సంప్రదాయమే సనాతన ధర్మానికి ఊపిరి


