సన్న, దొడ్డు వడ్లను వేరుగా సేకరించాలి | - | Sakshi
Sakshi News home page

సన్న, దొడ్డు వడ్లను వేరుగా సేకరించాలి

Apr 5 2025 1:46 AM | Updated on Apr 5 2025 1:46 AM

సన్న,

సన్న, దొడ్డు వడ్లను వేరుగా సేకరించాలి

● డీఆర్‌డీవో శేషాద్రి

సిరిసిల్ల: జిల్లాలో ఇందిర క్రాంతి పథం(ఐకేపీ) ద్వారా కొనుగోలు చేసే ధాన్యాన్ని సన్న వడ్లు, దొడ్డు వడ్లను వేర్వేరుగా సేకరించాలని డీఆర్‌డీవో శేషాద్రి పేర్కొన్నారు. సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో శుక్రవారం మహిళా సంఘాల ప్రతినిధులు, ఐకేపీ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 191 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు తరలించాలన్నారు. మద్ద తు ధరతోపాటు సన్నవడ్లకు అదనంగా రూ.500 బోనస్‌ను ప్రతీ క్వింటాలుకు చెల్లిస్తార ని వివరించారు. అదనపు డీఆర్‌డీవో గొట్టె శ్రీని వాస్‌, డీపీఎం సుధారాణి, శ్రీనివాస్‌, పౌరసరఫరాల శాఖ అధికారి రాజశేఖర్‌ పాల్గొన్నారు.

యువకుడి ఆత్మహత్య

సిరిసిల్లక్రైం: జిల్లా కేంద్రంలోని అంబికానగర్‌కు చెందిన చింతకుంట దుర్గాప్రసాద్‌(25) శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిని తండ్రి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తన కుమారుడికి ఎవరితోనూ గొడవలు లేవన్నారు. ఇటీవల డిగ్రీ పూర్తి చేసి పై చదువులు, గ్రూప్స్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడని వివరించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడని రోదించాడు. కుమారుడి మృతితో తల్లి లత కన్నీరుమున్నీరుగా విలపించింది.

వృద్ధురాలు..

ముస్తాబాద్‌(సిరిసిల్ల): అనారోగ్య సమస్య భరించలేక ఓ వృద్ధురాలు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై గణేశ్‌ తెలిపిన వివరాలు. మండలంలోని బందనకల్‌కు చెందిన పాతూరి మల్లవ్వ(54) ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైంది. నెల రోజుల క్రితం సిద్దిపేటలోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నా ఆరోగ్యం కుదుట పడలేదు. ఈక్రమంలోనే భర్త రాంరెడ్డితో కలిసి శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లింది. భర్త పశువులకు మేత వేసేందుకు వెళ్లగా.. అదే సమయంలో మల్లవ్వ అక్కడే ఉన్న చెట్టుకు తాడుతో ఉరివేసుకుంది. భర్త తిరిగి వచ్చి చూసేసరికి మల్లవ్వ విగతజీవిగా చెట్టుకు వేలాడడంతో షాక్‌కు గురయ్యాడు. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

నీట మునిగి వ్యక్తి మృతి

జగిత్యాలక్రైం: వ్యవసాయబావిలో మునిగిన పంప్‌సెట్‌ను తీసుకువచ్చేందుకు వెళ్లిన వ్యక్తి మృతిచెందిన సంఘటన జగిత్యాల రూరల్‌ మండలం అంతర్గాంలో చోటుచేసుకుంది. చెన్నవేని గంగాధర్‌ వ్యవసాయబావిలో విద్యు త్‌ మోటారు పడిపోయింది. దీన్ని తీసేందుకు శుక్రవారం గ్రామానికే చెందిన బత్తిని వెంకటి (51)ని తీసుకెళ్లాడు. విద్యుత్‌ మోటారు తీసే క్రమంలో ఊపిరాడక వెంకటి మృతిచెందాడు.

సన్న, దొడ్డు వడ్లను   వేరుగా సేకరించాలి1
1/1

సన్న, దొడ్డు వడ్లను వేరుగా సేకరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement