‘రాజీవ్ యువవికాసం’ రుణాలివ్వాలి
● బ్యాంకర్లతో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు బ్యాంకర్లు లక్ష్యం మేరకు రుణాలు అందించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో గురువారం బ్యాంకర్లతో సమీక్షించారు. సబ్సిడీ రుణాలు, బ్యాంకు లింకేజీని వేగంగా చేయాలన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, యూబీఐ రీజినల్ హెడ్ అపర్ణ, ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ వెంకటేశ్, ఎల్‌డీఎం మల్లికార్జున్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లపై..
జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను వేగంగా గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ కోరారు. కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించారు. సిరిసిల్ల మున్సిపాలిటీతోపాటు 12 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి 1,023 ఇళ్లను మంజూరు చేశామన్నారు. లబ్ధిదారులు వేగంగా పనులు ప్రారంభించేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పూర్తయి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం అర్హులైన పేదలు ఆన్‌లైన్‌లో ఈనెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇన్‌చార్జి డీఆర్‌వో రాధాబాయి, హౌసింగ్ పీడీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ధరణి దరఖాస్తులు పరిష్కరించాలి
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 408 ధరణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 13 మండలాల్లో 331 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆర్డీవోల వద్ద 61, అదనపు కలెక్టర్ వద్ద 16 దరఖాస్తులు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
పోరాట స్ఫూర్తికి ప్రతీక దొడ్డి కొమురయ్య
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య అని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. తొలి తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమురయ్య జయంతిని కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూమి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన దొడ్డి కొమురయ్య పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకుసాగాల్సిన అవసరం ఉందన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజమనోహర్‌రావు, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, సీపీవో శ్రీనివాసాచారి, గొల్ల, కురుమ సంఘాల నాయకులు ఏనుగుల కనకయ్య, సంబ లక్ష్మీరాజం పాల్గొన్నారు.
రాజన్న సేవలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్
వేములవాడ: రాజన్నను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్ గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించారు. అనంతరం వేదోక్త ఆశీర్వచనం గావించారు.


