‘రాజీవ్ యువ వికాసం’కు దరఖాస్తు చేసుకోండి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల: జిల్లాలోని అర్హులైన యువత రాజీవ్ యువవికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సోమవారం కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల నిరుద్యోగ యువత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి డిప్యూ టీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఎల్‌డీఎం మల్లికార్జున్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ అక్రమాలపై నిగ్గుతేల్చాలి
సిరిసిల్లటౌన్: మున్సిపల్ పాలకవర్గం పాలన పై రాజకీయ ఆరోపణలపై జిల్లా ఉన్నతాధికా రి పెదవి విప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోడం రమణ కోరారు. జిల్లా కేంద్రంలోని బీవైనగర్‌లోని పార్టీ ఆఫీసులో సోమ వారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. గత ఐదేళ్లు బీఆర్‌ఎస్ పాలకవర్గంపై కాంగ్రెస్ పార్టీ చేసిన అక్రమాల ఆరోపణలు, బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నరగా నిధులు విడుదల చేయకపోవడం వంటి అంశాలపై జిల్లా ఉన్నతాధికారి విచారణ చేపట్టాలని కోరారు. గత ఐదేళ్లలో డబుల్‌బెడ్‌రూమ్ పంపిణీ తదితర అంశాలపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ కమిటీ వేసి నిజనిర్ధారణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అదే సమయంలో జిల్లా కేంద్రం అభివృద్ధికి కూడా అధికార పార్టీ ప్రత్యేకంగా నిధులు వెచ్చించాలని కోరారు. జిందం కమలాకర్ పాల్గొన్నారు.
‘రాజీవ్ యువ వికాసం’కు దరఖాస్తు చేసుకోండి


