రాజన్న హుండీ ఆదాయం రూ.1.95కోట్లు | - | Sakshi
Sakshi News home page

రాజన్న హుండీ ఆదాయం రూ.1.95కోట్లు

Mar 27 2025 12:17 AM | Updated on Mar 27 2025 12:17 AM

రాజన్

రాజన్న హుండీ ఆదాయం రూ.1.95కోట్లు

వేములవాడ: రాజన్నకు 20 రోజుల్లో రూ.1,95,75,168 నగదుతోపాటు 287 గ్రాములు బంగారం, 18.500 కిలోల వెండి సమకూరిటన్లు ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి తెలిపారు. గుడి ఓపెన్‌స్లాబ్‌లో బుధవారం సీసీ కెమెరాల నిఘా మధ్య లెక్కించారు. నాంపల్లి శ్రీలక్ష్మీ నరసింహస్వామి హుండీ ఆదాయం ఆరు నెలలకు రూ.11,47,510 వచ్చినట్లు ఈవో తెలిపారు.

వనరుల దోపిడీ ఆపాల్సిందే..

పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌

పెద్దపల్లిరూరల్‌: దేశంలోని బడా కార్పొరేట్‌ శక్తులకు సహజవనరుల సంపదను దోచుకునేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ ఆరోపించారు. పెద్దపల్లిలో బుధవారం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కనారాయణరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అటవీ సంపదను దోపిడీ చేసేకుట్రలో భాగంగానే మహిళలపై అత్యాచారాలను సాగిస్తోందని ఆరోపించారు. ఆదివాసీల హక్కులను కాపాడి వారికి అండగా ఉండేందుకు అన్నివర్గాల ప్రజలు రక్షణగా నిలవాలని కోరారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీల హననాన్ని ఆపేయాలని, మహిళలపై అత్యాచారాలను నిలిపేయాలని, దండకారణ్యంలో పోలీసు క్యాంపులు ఎత్తేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని తీర్మానించారు.

కరీంనగర్‌లో ఏప్రిల్‌ 20న సభ..

ఆదివాసీహక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 20న కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, నక్క నారాయణరావు ప్రకటించారు. నాయకులు సదానందం, శ్రీనివాస్‌, వెంకన్న, రాజమల్లన్న, బాపన్న, రవి, రవీందర్‌, సదానందం, వినోద్‌, సంపత్‌ పాల్గొన్నారు.

రాజన్న హుండీ ఆదాయం రూ.1.95కోట్లు
1
1/1

రాజన్న హుండీ ఆదాయం రూ.1.95కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement