సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించండి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించండి

Mar 26 2025 12:53 AM | Updated on Mar 26 2025 12:51 AM

● ఎస్పీ మహేశ్‌ బీ.గీతే

కోనరావుపేట(వేములవాడ): సైబర్‌ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎస్పీ మహేశ్‌ బీ.గీతే అన్నారు. మంగళవారం కోనరావుపేట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్‌ పరిసరాలు, పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, కేసుల వివరాలు పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదులపై జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్ల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది పెట్రోలింగ్‌ సమయంలో రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, అనుమానంగా తిరుగుతున్న వ్యక్తులపై నిఘా పెట్టి తనిఖీ చేయాలన్నారు. విజుబుల్‌ పోలీసింగ్‌లో భా గంగా తరచూ గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మమేకమవుతూ సైబర్‌ నేరాలు, బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్స్‌ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ వెంట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రశాంత్‌రెడ్డి, ట్రెయినీ ఎస్సై రాహుల్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

కఠినంగా శిక్షించాలి

వేములవాడ: రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్న ఎర్రబాపు ఇస్రాయల్‌ను ఈనెల 24న హైదరాబాద్‌లోని చంపాపేట్‌లో దస్తగిరి అనే వ్యక్తి దారుణంగా హత్య చేయడంపై మంగళవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపినట్లు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుడిసె సదానందం తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దేశంలో న్యాయవాదులకు రక్షణ కరువైందని, అడ్వకేట్‌ ప్రొటెక్షన్‌ యాక్టును అమల్లోకి తీసుకువచ్చి రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్‌, న్యాయవాదులు నేరెళ్ల తిరుమల్‌గౌడ్‌, రేగుల దేవేందర్‌, పొత్తూరు అనిల్‌కుమార్‌, పిట్టల మనోహర్‌, పెంట రాజు, పురుషోత్తం, గోపికృష్ణ, ప్రతాప సంతోష్‌, గడ్డం సత్యనారాయణరెడ్డి, గోగికారి శ్రీనివాస్‌, గొంటి శంకర్‌, కటకం జనార్దన్‌, రేగుల రాజకుమార్‌, గుజ్జే మనోహర్‌, పంపరి శంకర్‌, అనిల్‌, వడ్లకొండ శ్రీకాంత్‌, కనికరపు శ్రీనివాస్‌, హరీశ్‌, నాగేంద్రబాబు, పొత్తూరి మల్లేశ్‌, అన్నపూర్ణ పాల్గొన్నారు.

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు వైష్ణవి

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మండలంలోని రహీంఖాన్‌పేట ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పయ్యావుల వైష్ణవి జాతీయస్థాయి సబ్‌ జూనియర్‌ కబడ్డీ పోటీలకు ఎంపికై నట్టు ప్రిన్సిపాల్‌ గంగాధర్‌ తెలిపారు. ఈనెల 27 నుంచి బిహార్‌లో జరిగే పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా వైష్ణవిని కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా చైర్మన్‌ ఆది శ్రీనివాస్‌, పాట్రన్‌ కేకే మహేందర్‌రెడ్డి, ఎస్జీఎఫ్‌ సెక్రెటరీ నర శ్రీనివాసరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు సాన బాబు, మామిడి శ్రీనివాసు అభినందించారు.

ప్రత్యేక పథకాలు అందించాలి

సిరిసిల్లటౌన్‌: తమ సామాజికవర్గం ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అందించాలని ఎరుకల ఏకలవ్య జిల్లా అధ్యక్షుడు కోనేటి సాయన్న కోరారు. మంగళవారం సంఘం ఎన్నికల అనంతరం కార్యవర్గంతో పాటు ప్రెస్‌క్లబ్‌లో సమావేశం ని ర్వహించారు. 13 మండలాల అధ్యక్షులు, ప్రఽ దాన కార్యదర్శులు సమావేశానికి విచ్చేసి నూ తన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కా ర్యదర్శిగా మొగలి ధర్మరాజు, మహిళా విభాగ జిల్లా అధ్యక్షురాలిగా కుర్ర సావిత్రి, ఉపాధ్యక్షులు మానుపాటి పరశురాములు, అనుముల దేవయ్య, కార్యదర్శి సుల్తాన్‌ తిరుపతి, కార్యవర్గ సభ్యులు కోలేటి రమేశ్‌, సుల్తాన్‌, శేఖర్‌, మొగిలి నాగరాజు, కట్ట శంకర్‌, నిమ్మల కనకయ్య, నిమ్మ రాజయ్య, మొగలి రాజశేఖర్‌, బిజిలి కనకరాజు, వానపాటి తిరుపతి, మొగిలి రవి, బండి యాదగిరి పాల్గొన్నారు.

సైబర్‌ నేరాలపై    అవగాహన కల్పించండి1
1/3

సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించండి

సైబర్‌ నేరాలపై    అవగాహన కల్పించండి2
2/3

సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించండి

సైబర్‌ నేరాలపై    అవగాహన కల్పించండి3
3/3

సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement