● అసెంబ్లీలో ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: జిల్లాలో పర్యాటకాభివృద్ధికి నిధులు విడుదల చేయాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. శనివారం అసెంబ్లీలో మాట్లాడుతూ మిడ్‌మానేరు, రాజన్న గుడి చెరువులో బోటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓసారి వేములవాడ ప్రాంతాన్ని పర్యటించాలని విన్నవించారు. నాంపల్లిగుట్టపైకి రోప్‌వే ఏర్పాటుతో భక్తులకు సులభంగా దర్శనభాగ్యం కలిగే అవకాశం ఉందన్నారు. హరితహోటల్‌ను ఆధునికీకరించాలని కోరారు. వేములవాడ ప్రాంతంలోని అనుబంధ మామిడిపల్లి సీతారామస్వామి, సనుగుల గోవిందరాజులస్వామి, రుద్రంగి శ్రీలక్ష్మీనర్సింహస్వామి, పోతారంలోని లొంకరామేశ్వరస్వామి, నాగారం సీతారామ ఆలయం, మన్నెగూడెం, భీమారం ఆలయాలను అభివృద్ధి చేయాలని కోరారు. పర్యాటకాభివృద్ధితో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు.
పేపర్ లీకులు..
నోటిఫికేషన్లు వాయిదా
● కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి
సిరిసిల్లటౌన్: పోటీపరీక్షల పేపర్ లీకులు..నోటిఫికేషన్ల వాయిదాలు తప్ప పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నిరుద్యోగులకు ఇచ్చిందేమీ లేదని సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి విమర్శించారు. సిరిసిల్లలోని తన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల రాక్షసపాలన నుంచి విముక్తి కోరిన తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి సంక్షేమం అంటే ఏంటో చూపించారన్నారు. బీసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై అసెంబ్లీలో తీర్మానం చేయడమే ఆయా వర్గాలపై కాంగ్రెస్‌కు ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, సోనియాగాంధీలపై చిల్లర, మల్లర ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పట్ట ణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, గడ్డం నర్సయ్య, కాముని వనిత, వెల్ముల స్వరూపరెడ్డి, గోనె ఎల్లప్ప, బైరినేని రాము, గంభీరావుపేట ప్రశాంత్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ది నిరంకుశ పాలన
సిరిసిల్లటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తోందని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి నిధుల కేటాయింపులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి నిరసనగా బీఆర్‌ఎస్వీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా శనివారం జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వారు మాట్లాడుతూ బడ్జెట్‌లో విద్యారంగానికి 25 శాతం నిధులు కేటాయించాలని కోరారు. స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఒక్క రూపాయి విడుదల చేయలేదని విమర్శించారు. గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే కనీసం రివ్యూ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు మానాల అరుణ్, ఎస్‌కే బాబాషేక్, సికింధర్, కంచర్ల రవిగౌడ్, కనుకుంట్ల వెంకటరమణ ఉన్నారు.
కుష్ఠు వ్యాధిని ప్రారంభంలో గుర్తిస్తే నివారించవచ్చు
● స్టేట్ అబ్జర్వర్ డాక్టర్ అరుణశ్రీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కుష్ఠు వ్యాధిని ప్రారంభదశలో గుర్తిస్తే అంగవైకల్యం నుంచి కాపాడవచ్చని స్టేట్ అబ్జర్వర్ డాక్టర్ అరుణశ్రీ పేర్కొన్నారు. మండలంలోని నేరెళ్ల పీహెచ్‌సీ పరిధిలో నిర్వహిస్తున్న ఎల్సీడీసీ లిప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపేయిన్ (కుష్టు వ్యాధి నివారణ ప్రచారం)ను శనివారం పరిశీలించారు. జిల్లెల్ల హెల్త్ సబ్‌సెంటర్‌ను తనిఖీ చేశారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కె.అనిత, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రిక, డీపీఎంవోలు సీహెచ్.శ్రీనివాస్, ఈ.దేవ్‌సింగ్, సూపర్‌వైజర్ రాజేందర్ పాల్గొన్నారు.
పర్యాటకాభివృద్ధికి కృషి చేయండి
పర్యాటకాభివృద్ధికి కృషి చేయండి
పర్యాటకాభివృద్ధికి కృషి చేయండి


