● ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అనవసర హంగామా లేకుండా వాస్తవికత అద్దంపట్టేలా బడ్జెట్‌ను రూపొందించారన్నారు. రైతులు, మహిళలు, దళిత, బడుగు బలహీన, మైనార్టీ వర్గాలను సంతృప్తి పరిచేలా బడ్జెట్ ఉందన్నారు. వచ్చే పదేళ్లలో తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. గతేడాదితో పోల్చితే తెలంగాణ వృద్ధి రేటు 10.01 శాతంగా నమోదైందన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 దేశ తలసరి ఆదాయం కంటే 1.8 రెట్లు అధికంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
రాజన్నకు రూ.100కోట్లపై కృతజ్ఞతలు
రాష్ట్ర బడ్జెట్‌లో వేములవాడ రాజన్నకు రూ.100 కోట్లు కేటాయించడంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు. వేములవాడ పట్టణంతోపాటు రాజన్న ఆలయం, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. బీసీ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలసి స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను శాలువాతో సత్కరించారు.
నీటి సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలి
వేములవాడఅర్బన్: వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీలు, గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఆటంకాలు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మండలం అగ్రహారం శివారులోని మిషన్ భగీరథ ఫిల్టర్‌బెడ్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, నీటిశుద్ధి సరఫరా ల్యాబ్‌ను బుధవారం పరిశీలించారు. పంపింగ్ సామర్థ్యం, స్టోరేజీ వివరాలను తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో ఇంటింటికీ నల్లా నీరు వచ్చేలా చూడాలన్నారు. నీటి నాణ్యతను రోజూ నాలుగు సార్లు పరిశీలించాలని సూచించారు. మిషన్ భగీరథ ఇంజినీర్లు జానకి, శేఖర్‌రెడ్డి, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ ఉన్నారు.
ఎస్సీ వర్గీకరణపై హర్షం
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడంపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో బుధవారం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మ్యాన ప్రసాద్, గడ్డం నర్సయ్య, నీలి రవీందర్, గంభీరావుపేట ప్రశాంత్, వంతడ్పుల రాము, గోనె ఎల్లప్ప, తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్