రోజు 500 మీటర్ల దూరం నుంచి నీళ్లు మోసుకుంటున్నం. మా కాలనీలో ఇరవై గడపల మందిమి సొంతంగా బోరు వేయించుకున్నాం. దానిలో నీరు అడుగంటింది. మున్సిపాల్టీలోల్లకు చెబితే సమస్య తీరడం లేదు. నీళ్లకు ఇంత కష్టం ఎన్నడూ రాలేదు. ఒక్క ట్యాంకర్‌కు రూ.700 పెట్టి కొనాల్సి వస్తోంది.
– వాగుమడి సుమలత, గుర్రపుకాలనీ
భగీరథ నీళ్లే దిక్కు
మా కాలనీలో 20 కుటుంబాలు ఉంటున్నాయి. మా కు మిషన్ భగీరథ వస్తేనే మంచినీళ్లు.. లేదంటే బావుల్లోని నీళ్లు తాగుతాం. చా లా ఏడాది సంది మిషన్ భగీరథ నీళ్లు రావడం లే దు. వ్యవసాయ బావులు, బోర్ల నుంచి నీళ్లు తె చ్చుకుని తాగుతున్నాం. మున్సిపల్‌లో చెప్పినా లాభం లేదు. మా ఏరియాలో మోర్లు తీయడం లేదు. – కొంపెల్లి కళ, మాలపల్లె, పెద్దూరు పవర్‌బోరు పాడైంది
మా పల్లెలో సుమారు 100 కుటుంబాలున్నాయి. అందరికీ కలిపి మూడు బోర్లు. ఒకటి మజీద్‌ది, రెండు మున్సిపల్ పవర్‌బోర్లు. వాటిలో ఒక మున్సిపల్ బోరు ఎండిపోయింది. పవర్‌బోరు పైపులైన్ పాడైంది. అందరం రౌతుకొట్టుకుని బతికేటోళ్లం. ట్యాంకర్ నీళ్లు కొనుక్కోలేము. అధికారులు స్పందించాలి.
– సయ్యద్ రుక్సార్‌బేగం, తుర్కాశిపల్లి
నీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ
సిరిసిల్లలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాం. నీళ్లు రాని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా అందిస్తాం. ప్రత్యేకంగా సమ్మర్‌ప్లాన్ అమలు చేస్తాం. తాగునీటి సమస్యపై చర్యలు తీసుకునేందుకు కార్యాలయంలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశాం. 78935 93330కు ఫోన్ చేస్తే సత్వరమే పరిష్కరిస్తాం.
– ఎస్.సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్
ట్యాంకర్ నీటికి రూ.700
ట్యాంకర్ నీటికి రూ.700
ట్యాంకర్ నీటికి రూ.700


