సిరిసిల్లటౌన్: పండుగ పూట ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన బాట పట్టారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలయ్యే వరకు ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు వాయిదా వేయాలని ఎంఆర్‌పీఎస్, ఎంఎస్‌పీ ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షలు ఏడో రోజుకు చేరాయి. ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలు జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ దీక్షలో బడుగు లింగయ్య, మంగలి చంద్రమౌళి, శావనపల్లి బాలయ్య, కృష్ణభగవాన్, మల్లారపు నరేష్, ప్రశాంత్ పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయండి
సిరిసిల్లటౌన్: సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) పరిధిలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేయాలని పౌరసంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్ కోరారు. సిరిసిల్లలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ నాగార్జున ఈనెల 18న సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న సదస్సుకు హాజరుకా వాలని కోరారు. విద్యుత్ సరఫరా, లూజ్‌వైర్లు, సకాలంలో ఫ్యూజులు వేయకుండా డిపాజిట్ కట్టిన కరెంటు పోల్ వేయకున్నా, ట్రాన్స్‌ఫార్మర్‌లు వేయకున్నా, బిల్లుల్లో తేడాలున్నా ఫిర్యా దు చేయవచ్చని తెలిపారు. కరెంట్‌షాక్‌తో ప శువులు చనిపోతే రూ.40వేలు, మనుషులు చనిపోతే రూ.5లక్షలు పరిహారం పొందవచ్చని వివరించారు. కుసుమ గణేశ్, చిప్ప దేవదాస్, వేముల పోశెట్టి, నల్ల మురళి, దొంతుల ప్రతా ప్, వేముల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎండుతున్న పంటలను కాపాడాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలో చివరి దశలో ఉన్న వరిపంటలను కాపాడాలని గన్నెవారిపల్లి, పోతుగల్, నిమ్మవారిపల్లి గ్రామాల రైతులు అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులకు ఆదివారం విన్నవించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, పోతుగల్ మాజీ సర్పంచ్ తన్నీరు గౌతంరావు, ఏఎంసీ వైస్‌చైర్మన్ వెల్ముల రాంరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి కొండం రాజిరెడ్డిలతో పంటల పరిస్థితిని చర్చించారు. నెల రోజులైతే పంట కోతలకు వస్తాయని, భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎత్తిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముస్తాబాద్ పెద్దచెరువు నుంచి నీటిని విడుదల చేస్తే 300 ఎకరాల్లో వరిపంట చేతికొస్తుందని, లేదంటే లక్షలాది రూపాయలు నష్టపోతామని రైతులు గన్నె నర్సింలు, బాల్‌నర్సయ్య, అంజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి నీటిని ఎక్కువగా విడుదల అయ్యేలా చర్యలు తీసుకుంటామని బాల్‌రెడ్డి తోపాటు ఇతర నాయకులు హమీ ఇచ్చారు.
సెలవు పూట..నిరసన బాట
సెలవు పూట..నిరసన బాట


