
బీసీ భవన్‌లో సమావేశమైన బీసీ ప్రతినిధులు
● బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు
సిరిసిల్ల: బీసీల సమస్యలు పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హ న్మాండ్లు కోరారు. సిరిసిల్ల బీసీ భవన్‌లో బీసీ సంఘం ప్రతినిధులతో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సమావేశమయ్యారు. పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ బీసీ సమస్యలు పరిష్కరించే పార్టీలకు ఎన్నికల్లో అండగా ఉంటామన్నారు. బీసీ సమస్యలను బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య ముందుంచి, వీటిని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ఎన్నికల్లో మిగతా పార్టీ వాళ్లు కూడా బీసీ సంఘం మద్దతు కోరుతున్నారని జిల్లా కార్యవర్గం, జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష, కార్యవర్గంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హన్మాండ్లు స్పష్టం చేశారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు తడక కమలాకర్, రవీందర్, కంచర్ల రాజు, కందుకూరి రామాగౌడ్, అనిల్, కంచర్ల రవిగౌడ్, తిరుపతి, కై లాష్, రవీందర్, బోయిన శ్రీనివాస్, సురేష్, శ్రీనివాస్, శ్రీధర్ పాల్గొన్నారు.