జిల్లా కాంగ్రెస్ ఆఫీస్‌లో..
సిరిసిల్లటౌన్: నిజాం నిరంకుశత్వం నుంచి ప్రజాస్వామ్యంలోకి మారిన రోజును పురస్కరించుకొని జిల్లాకేంద్రంలో ఆదివారం జాతీయతా భావం వెల్లివిరిసింది. జాతీయ పండుగలా పట్టణంలో తిరంగా జెండాలు ఎగిరాయి. ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాల ముందు త్రివర్ణ పతకాలు రెపరెపలాడాయి. స్థానిక చేనేతన్నచౌక్‌లో సామాజిక సమరసత వేదిక, గాంధీనగర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు. బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ ఆడెపు రవీందర్, పట్టణాధ్యక్షుడు గాజుల శ్రీనివాస్, అంజన్న, కై లాశ్, ఊరగొండ రాజు, శ్రీగాధ మైసయ్య, గుడ్ల విష్ణు పాల్గొన్నారు. డీసీసీ ఆఫీసులో పీసీసీ కార్యదర్శి నాగుల సత్యనారాయణగౌడ్, గాంధీచౌక్‌లో పట్టణాధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ జెండాలు ఆవిష్కరించారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, మాజీ కౌన్సిలర్ మడుపు శ్రీదేవి, నాయకులు ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, అశోక్ పాల్గొన్నారు. సీపీఐ ఆఫీస్‌లో జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి వేణు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో వేడుకలు
బీజేపీ ఆధ్వర్యంలో..


