సాక్షి టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ సీపీ బలంగా ఉన్న పంచాయతీల్లో అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు రాత్రికి రాత్రే వైఎస్సార్ సీపీ నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నారు.
దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం నాయుడుపాలెం, తూర్పు కమ్మంపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, ఏజెంట్లను శనివారం రాత్రి ఎస్ఐ కోటేశ్వరరావు అక్రమంగా అరెస్టు చేశారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లు బంకా నాగిరెడ్డి, రాంబాబులను ప్రీమియం అరెస్టులు అంటూ భయభ్రాంతులకు గురిచేసి ముండ్లమూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


